త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్‌కు గుండెపోటు

త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్ గుండెపోటుకు గుర‌య్యారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న ఉన్న‌ట్టుండి గుండెపోటుకు గుర‌య్యారు. అయితే వెనువెంట‌నే స్పందించిన ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను చెన్నైలోని కావేరీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్రస్తుతం ఆయ‌న కావేరీ ఆసుప‌త్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇటీవ‌లే క‌రోనా బారిన ప‌డిన విక్ర‌మ్ దాని నుంచి పూర్తిగా కోలుకున్న సంగ‌తి తెలిసిందే.

 

స్టార్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం రూపొందిస్తున్న పొన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రంలో విక్ర‌మ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం శుక్ర‌వారం సాయంత్రం చెన్నైలో జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి విక్ర‌మ్ కూడా హాజ‌రు కావాల్సి ఉంది. ఈ క్ర‌మంలో విక్ర‌మ్ గుండెపోటుకు గురి కావ‌డం గ‌మ‌నార్హం.

Leave A Reply

Your email address will not be published.