ప్రభాస్ గురించి విన్నాను .. ఇప్పుడు చూశాను: దిశా పటాని

దిశా పటాని ‘లోఫర్’ సినిమాతోనే వెండితెరకి పరిచయమైంది. ఆ తరువాత మళ్లీ ఇక్కడి తెరపై కనిపించలేదు. బాలీవుడ్ లో కూడా అమ్మడి దూకుడు అంత గొప్పగా ఏమీలేదుగానీ, క్రేజ్ కి ఎంతమాత్రం తక్కువలేదు. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను వదులుతూ ఎప్పటికప్పుడు కుర్రాళ్ల గుండెలను గుప్పెట్లో పట్టుకుంటోంది. హిందీలో ఆమె ఓ మూడు ప్రాజెక్టులను చేస్తోంది. ఆ సినిమాలు ఆయా దశలలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రభాస్ సరసన ‘ప్రాజెక్టు K’ చేస్తోంది. ఇటీవలే షూటింగులో కూడా పాల్గొంది.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. ” ప్రభాస్ తాను స్టార్ అనే విషయాన్ని పక్కన పెట్టేసి చాలా సింపుల్ గా ఉంటాడని విన్నాను. నిజంగానే ఆయన ఎంత మంచి మనిషి అనేది దగ్గర నుంచి చూశాను.అందరూ చెప్పినట్టుగానే ఆయన తన ఇంటి నుంచి తెప్పించిన భోజనాన్ని స్వయంగా వడ్డించాడు. ఆయన చూపించే అభిమానాన్ని ఎవరూ కూడా అంత తేలికగా మరిచిపోలేరు. అలాంటి హీరోను నేను ఇంతవరకూ చూడలేదు. ఈ సినిమా నా కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అంటూ చెప్పుకొచ్చింది.
Prabhas, Deepika Padukone, Disha Patani, Project K Movie

Leave A Reply

Your email address will not be published.