ఐశ్వర్య అర్జున్ రెడీ .. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్!

తమిళ .. కన్నడ భాషల్లో కథానాయికగా అర్జున్ కూతురు ఐశ్వర్య పరిచయమైంది. ఆ సినిమాలతో గ్లామర్ పరంగా ఆమె కి మంచి మార్కులు పడ్డాయిగానీ .. కెరియర్ ఇంకా పుంజుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేయడానికి అర్జున్ రీసెంట్ గా రంగంలోకి దిగారు.  ఇటీవలే ఈ సినిమా పవన్ కల్యాణ్ క్లాప్ తో లాంఛనంగా మొదలైంది. ఈ సినిమాలో హీరోగా విష్వక్సేన్ నటించనున్నాడు. ఆయన ‘ధమ్కీ’ సినిమా షూటింగులో బిజీగా ఉండటం వలన, ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకావడానికి ఆలస్యమైంది.

తాజాగా ఈ సినిమా మ్యూజిక్ సిటింగ్స్ ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.  సాహిత్యాన్ని చంద్రబోస్ అందిస్తున్నారు. అర్జున్ సొంత బ్యానర్లో .. ఆయన దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందనుంది.  త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.