నేరుగా ఓటీటీలోకి వస్తున్న అమలాపాల్ నిర్మించిన సినిమా

సినిమాలను ఓటీటీలు చంపేస్తున్నాయనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. పెద్దపెద్ద హీరోల సినిమాలు కూడా రోజుల వ్యవధిలోనే ఓటీటీల్లోకి వచ్చేస్తుండటంతో జనాలు థియేటర్లకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. నాలుగు రోజులు ఆగితే హాయిగా ఇంట్లోనే సినిమా చూసుకోవచ్చనే పరిస్థితికి దాదాపు చాలా మంది వచ్చేశారు. దీంతో, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టాలు వస్తున్నాయి. మరోవైపు, ఇంకొందరు నేరుగా ఓటీటీల్లో సినిమాలు విడుదల చేసేస్తున్నారు. ముఖ్యంగా చిన్న నిర్మాతలు థియేటర్లలో సినిమా విడుదల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ బడ్జెట్ కు ఓటీటీనే బెస్ట్ ప్లాట్ ఫామ్ అని భావిస్తున్నారు.

ఇక సంచలన నటి అమలాపాల్ విషయానికి వస్తే… భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె ఎక్కవ సినిమాలు చేయలేదు. సినిమాల కంటే వ్యక్తిగత విషయాల్లోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలిచారు. తమిళ హీరో ధనుష్ కారణంగానే ఆమె తన భర్తకు దూరమయినట్టు వార్తలు వచ్చాయి.

తాజాగా ఆమె నిర్మాతగా మారింది. ‘కడావర్’ పేరుతో సినిమాను నిర్మించింది. ఈ చిత్రంలో తనే ప్రధాన పాత్రను పోషించింది. మెడికల్ క్రైమ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో హరీశ్ ఉత్తమన్, మునీశ్ కాంత్, పశుపతి, నిళల్ గళ్ రవి తదితరులు నటించారు. ఈ సినిమాను అమలా పాల్ నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ 12 నుంచి సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.
Amala Paul, Tollywood, Kollywood, OTT

Leave A Reply

Your email address will not be published.