‘17 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అంటున్న అనుష్క

‘సూపర్’ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి ‘బాహుబలి’తో ప్యాన్ఇండియా స్టార్ అయిన హీరోయిన్ అనుష్క షెట్టి. ఈ మధ్య ఆమె గ్లామర్‌‌ రోల్స్‌ను పక్కనబెట్టి, నాయికా ప్రాధాన్యత ఉన్న సినిమాలపై దృష్టి పెట్టింది. అయితే ‘నిశ్శబ్దం’ సినిమా వచ్చి రెండేళ్లవుతున్నా మళ్లీ తెరపైకి రాలేదామె. గతేడాది అనుష్క పుట్టిన రోజు సందర్భంగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ సినిమాని ప్రకటించింది. ఇందులో నవీన్ పోలిశెట్టి మరో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ పి.మహేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఆ తర్వాత చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే వీటికి నవీన్ పోలిశెట్టి పుల్ స్టాప్ పెట్టాడు. ప్రస్తుతం అనుష్క ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటోంది. అయితే, అనుష్క తొలి చిత్రం ‘సూపర్’ విడుదలై 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా షూటింగ్ లొకేషన్‌లో కేక్ కట్ చేసి వేడుక నిర్వహించింది చిత్ర బృందం.

‘17 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అని రాసి ఉన్న కేక్‌ ఫొటోని అనుష్క ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇదే ఫొటోను నవీన్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ఈ పదిహేడేళ్లలో నేనే అనుష్కకి బెస్ట్ కో స్టార్ అంట. అద్భుతమైన తన ఇన్నేళ్ల ప్రయాణానికి ఆమెకు శుభాకాంక్షలు. మా సినిమా షూటింగ్ జరుగుతోంది’ అని పేర్కొన్నాడు.

దాంతో, అటు ఈ చిత్రం ఆగిపోలేదనే విషయంతో పాటు అనుష్క 17 ఏళ్ల ప్రయాణం గురించి తెలిసి ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా, అనుష్కకి ఇది నలభై ఎనిమిదో చిత్రం. మరోపక్క, తమిళ దర్శకుడు ఎ.ఎల్ విజయ్ దర్శకత్వంలో ఓ సినిమాకు కూడా అనుష్క ఓకే చెప్పింది.
Tollywood, Anushka Shetty, 17 years of super movie, bahubali

Leave A Reply

Your email address will not be published.