కోలీవుడ్ నుంచి పూజ హెగ్డేకి భారీ ఆఫర్!

కెరియర్ ఆరంభంలో కాస్త ఒడిదుడుకులు ఎదురైనా, ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా నుంచి మాత్రం పూజ హెగ్డే వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. స్టార్ హీరోలతో సినిమాలు .. భారీ విజయాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. కానీ పాన్ ఇండియా అంటూ వచ్చిన సినిమాలు ఆమె అభిమానులను నిరాశపరిచాయి.

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ .. విజయ్ ‘బీస్ట్’ .. చరణ్ తో చేసిన ‘ఆచార్య’ సినిమాలు పరాజయం పాలయ్యాయి. తమిళంలో ఆమె చేసిన తొలి సినిమాతో పాటు రీసెంట్ గా చేసిన ‘బీస్ట్’ కూడా భారీ ఫ్లాప్ గా మిగిలిపోయింది. దాంతో ఇక కోలీవుడ్ నుంచి ఆమెకి అవకాశాలు రావడం కష్టమేననే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆమెకి సూర్య సినిమా నుంచి ఛాన్స్ వచ్చింది.

ప్రస్తుతం బాలా .. వెట్రిమారన్ వంటి దర్శకులతో సూర్య సినిమాలు చేస్తున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టును ఆయన శివతో చేయనున్నాడు. ఈ సినిమా కోసమే పూజ హెగ్డేను తీసుకోవడం జరిగిందని అంటున్నారు. ‘బీస్ట్’ సక్సెస్ కాకపోయినా, పారితోషికం విషయంలో పూజ ఎంతమాత్రం తగ్గలేదనే టాక్ బలంగానే వినిపిస్తోంది.
Tags: Surya, Shiva, Pooja Hegde, Kollywood

Leave A Reply

Your email address will not be published.