విక్రమ్ ‘కోబ్రా’ విడుదల తేదీ ఖరారు!

విక్రమ్ హీరోగా ‘కోబ్రా’ సినిమా రూపొందింది. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాలో విక్రేణ సరసన నాయికగా శ్రీనిధి శెట్టి అలరించనుంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాను తమిళంతో పాటు  తెలుగు .. కన్నడ భాషల్లో ఈ నెల 11వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తరువాత వాయిదా వేసుకున్నారు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా కొంతసేపటిక్రితం ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు.

విభిన్నమైన కథాకథనాలతో రూపొందించిన ఈ సినిమాపై విక్రమ్ గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. తాను కొంత కాలంగా వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో పడుతుందని ఆయన భావిస్తున్నాడు. ముఖ్యమైన పాత్రల్లో ఇర్ఫాన్ పఠాన్ .. మియా జార్జ్ కనిపించనున్నారు. ఈ సినిమా హిట్ అయితే తన పారితోషికం పెంచే ఆలోచనలో శ్రీనిధి శెట్టి ఉన్నట్టుగా టాక్.

Leave A Reply

Your email address will not be published.