రణబీర్ కపూర్ షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తాజా చిత్రం ‘లవ్ రంజన్’ సినిమా షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ముంబై అంధేరీలోని చిత్రకూట్ మైదానంలో వేసిన సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే సెట్ మొత్తానికి మంటలు వ్యాప్తించాయి.

ప్రమాదంలో మనీశ్ దేవాశీ అనే 32 ఏళ్ల వ్యక్తి మరణించాడు. మరికొందరు గాయపడ్డారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో హీరో, హీరోయిన్లు షూటింగ్ స్పాట్ లో లేకపోవడం వల్ల వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తోంది. అగ్నిప్రమాదంపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.