త్వరలో మా కాంబినేషన్లో ఒక సినిమా: కల్యాణ్ రామ్

కల్యాణ్ రామ్ హీరోగా.. నిర్మాతగా ‘బింబిసార’ సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో ఆయన రెండు వైవిధ్యభరితమైన పాత్రలలో .. విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు. సోషియో ఫాంటసీ జోనర్లో తను చేసిన ఈ సినిమాపై ఆయన చాలా గట్టి నమ్మకంతో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ సినిమాను కల్యాణ్ రామ్ నిర్మించిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక కొరటాలతో ఎన్టీఆర్ చేయనున్న సినిమాకి కూడా కల్యాణ్ రామ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. తాజా ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. “ఆ మధ్య నా సొంత బ్యానర్లో బాబాయ్ హీరోగా ఒక సినిమా చేయాలనుకున్నాను. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. మళ్లీ ఆయనతో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాను. త్వరలో తప్పకుండా మా కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుంది” అన్నాడు. మరి ఆ సినిమాలో కల్యాణ్ రామ్ కూడా చేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.