మణిరత్నం కోసం రంగంలోకి కమల్!

కమల్ ‘విక్రమ్’ సినిమాతో మరోసారి తన విశ్వరూపం చూపించారు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఈ సినిమా ఆయన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. అలాంటి కమల్ ‘పొన్నియన్ సెల్వన్’ కి వాయిస్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. మణిరత్నం దర్శకత్వంలో .. లైకా నిర్మాణంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమైంది.

తమిళంతో పాటు తెలుగు .. కన్నడ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి అనేక విశేషాలు జోడిస్తూ ఉండటంతో, అంతకంతకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో అక్కడక్కడా సన్నివేశాలను కలుపుతూ వాయిస్ ఓవర్ ఉంటుందట.

ప్రతి భాష నుంచి ఒక స్టార్ ను ఎంచుకుని ఆ వాయిస్ ఓవర్ ను చెప్పించాలనే నిర్ణయానికి వచ్చిన మణిరత్నం, తమిళంలో కమల్ చెబితే బాగుటుందని భావించినట్టుగా సమాచారం. ‘నాయకన్’ నుంచి కమల్ .. మణిరత్నం మధ్య మంచి అనుబంధం ఉంది. అందువలన మణిరత్నం అడిగిన వెంటనే కమల్ ఓకే చెప్పారని అంటున్నారు.
Tags: Vikram, Aishwarya Rai, Manirathnam, Ponniyan Selven Movie

Leave A Reply

Your email address will not be published.