కత్రినాకైఫ్, విశాల్ కౌశల్ ను చంపుతానంటూ బెదిరింపులు.. కేసు నమోదు

ప్రముఖ బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విశాల్ కౌశల్ లను చంపుతానంటూ సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి హెచ్చరిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి పేరిట ముంబై పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై విక్కీ కౌశల్ శాంతాక్రజ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ ద్వారా తమను బెదిరిస్తున్నట్టు, బెదిరింపు ఇమేజ్ లను పోస్ట్ చేస్తున్నాడంటూ ఆయన తన ఫిర్యాదులో వివరించాడు. సదరు వ్యక్తి క్రతినా కైఫ్ ను వెంబడిస్తున్నట్టు పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది.

ఇక, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ గతేడాది డిసెంబర్ 9న వివాహం చేసుకోవడం తెలిసిందే. ప్రస్తుతం వీరు వరుసగా సినిమా షెడ్యూళ్లతో బిజీగా ఉండడం గమనార్హం. ఇటీవలే మాల్దీవుల్లో ఈ జంట విహరించి వచ్చిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.