మెగాస్టార్ చిరంజీవి సమర్పించు ‘లాల్​ సింగ్​ చడ్డా’

బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. హిందీతో పాటు పలు భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ఇది విడుదల కానుంది. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్ర పోషించాడు. పలు ఆస్కార్ అవార్డులు గెలిచిన హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఆమిర్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కరీనా కపూర్, మోనా సింగ్, మానవ్ విజ్, ఆర్యా శర్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ తో కలిసి వయాకామ్18 స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ‘లాల్ సింగ్ చడ్డా’ తెలుగు పోస్టర్ ను శనివారం ఉదయం ట్విట్టర్ లో షేర్ చేశారు. తన సన్నిహిత మిత్రుడు ఆమిర్ ఖాన్ నటించిన ఎమోషనల్ చిత్రం తెలుగు వెర్షన్ ను సమర్పించాడన్ని ప్రత్యేకమైన విశేషంగా భావిస్తున్నానని చెప్పారు. ఆమిర్ ను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని అభిప్రాయపడ్డారు.

Chiranjeevi, Aamir Khan, laal sing chaddha, presents, Naga Chaitanya, Bollywood telugu

Leave A Reply

Your email address will not be published.