‘గాడ్ ఫాదర్’ గా యాక్షన్ లోకి దిగిపోయిన మెగాస్టార్!

చిరంజీవి కథానాయకుడిగా ‘గాడ్ ఫాదర్’ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మలయాళంలో ఆ మధ్య విజయాన్ని సాధించిన ‘లూసిఫర్’ సినిమాకి ఇది రీమేక్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సల్మాన్ ఖాన్ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదులో జరుగుతోంది.

ఒక భారీ యాక్షన్ సీన్ ను చిరంజీవిపై చిత్రీకరిస్తున్నారు. సల్మాన్ కూడా ఈ సీన్ లో పాల్గొంటున్నాడు. ఈ యాక్షన్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరగనుందని అంటున్నారు. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నయనతార కనిపించనుంది.

ఆమె భర్త పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నాడు. ఇప్పటికే బయటికి వచ్చిన చిరంజీవి లుక్, ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ‘దసరా’కి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక చిరంజీవి తదుపరి సినిమాలుగా ‘భోళా శంకర్’ .. ‘వాల్తేర్ వీరయ్య’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.