ఆయన నా భర్త కాదు.. మాజీ భర్త: సమంత

బాలీవుడ్ లో సమంత తాజా సెన్సేషన్ గా నిలుస్తోంది. హిందీ సినీ పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది. తాజాగా ఆమె కరణ్ జొహార్ షో ‘కాఫీ విత్ కరణ్’లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అక్షయ్ కుమార్ తో కలిసి ఆమె ఈ షోలో పాల్గొంది. ఈ షోలో నాగచైతన్య గురించి కరణ్ ప్రస్తావించాడు. మాటల మధ్యలో చైతూని భర్తగా కరణ్ సంబోధించగా… ఆయన భర్త కాదు, మాజీ భర్త అని సమంత చెప్పింది.

ప్రస్తుతం ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందని కరణ్ అడిగితే… ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే, ఆ గదిలో కత్తులు వంటి వాటిని దాచేయాలని చెప్పింది. ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు లేవని తెలిపింది. భవిష్యత్తులో ఫ్రెండ్లీగా ఉండొచ్చేమో చెప్పలేమని వ్యాఖ్యానించింది. విడాకుల వల్ల తాను అప్సెట్ కాలేదని తెలిపింది. విడాకుల తర్వాత తాను 250 కోట్ల భరణం తీసుకున్నానని ప్రచారం చేశారని… అది నిజం కాదని చెప్పింది.
Samantha, Naga Chaitanya, Coffe with Karan

Leave A Reply

Your email address will not be published.