పవన్ ఆ రీమేక్ చేయడం లేదట!

పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేయవలసి ఉంది. ఈ రెండు సినిమాల మధ్యలో ‘వినోదయా సితం’ అనే తమిళ సినిమా రీమేకులో చేయవలసి ఉంది. ఈ సినిమాలకి సంబంధించిన సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే పవన్ మరో తమిళ సినిమా రీమేకులో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కొంతకాలం క్రితం తమిళంలో విజయ్ చేసిన ‘తేరి’ సినిమా, తెలుగులో ‘పోలీసోడు’ టైటిల్ తో వచ్చింది. తమిళంలో ఆ సినిమా విజయ్ కి ఉన్న క్రేజ్ వలన లాగిందిగానీ, తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు.

అలాంటి సినిమాను ‘సాహో’ డైరెక్టర్ సుజీత్ తో చేయాలని పవన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు రాజకీయాలలో తాను మరింత చురుకుగా పనిచేయవలసిన సమయం ఆసన్నం కావడంతో, ఆ సినిమాను తాను చేయలేకపోతున్నట్టుగా చెప్పారట. ఇక ‘భవదీయుడు భగత్ సింగ్’ కూడా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లడం డౌటే అనే మాట వినిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.