త్రివిక్రమ్, మహేష్ మూవీ లో ఛాన్స్ కొట్టేసిన ప్రియాంక అరుళ్ మోహన్

ప్రియాంక అరుళ్ మోహన్ .. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమా ద్వారా ఈ సుందరి తెలుగు తెరకి పరిచయమైంది. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ఆకట్టుకుంది. ఆ తరువాత శర్వానంద్ జోడీగా ‘శ్రీకారం’ సినిమా కూడా చేసింది. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి.

దాంతో ప్రియాంక తమిళ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి .. అక్కడ వరుస అవకాశాలను అందుకుంటోంది. ఈ నాజూకు భామకు అక్కడ అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. తాజాగా మహేశ్ జోడీగా ఈ బ్యూటీని త్రివిక్రమ్ ఎంపిక చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మహేశ్ హీరోగా త్రివిక్రమ్ చేయనున్న సినిమా వచ్చే నెలలో పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకి ఒక కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. రెండబ కథానాయికగా శ్రీలీల పేరు వినిపించింది. తాజా గా ప్రియాంకా అరుళ్ మోహన్ పేరు తెరపైకి వచ్చింది. హారిక అండ్ హాసిని వారు నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘సంక్రాంతి’కి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Mahesh Babu, Pooja Hegde, priyanka Arul Mohan, Trivikram Movie

Leave A Reply

Your email address will not be published.