టాలీవుడ్ లో మరో విషాదం.. నిర్మాత రాజేంద్రప్రసాద్ మృతి

సినీ ప్రముఖుల వరుస మరణాలు టాలీవుడ్ ను విషాదంలో ముంచేస్తున్నాయి. ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు మరణించి రెండు రోజులు కూడా గడవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయన మరణంతో టాలీవుడ్ ప్రముఖులు షాక్ కు గురయ్యారు. మూవీ మొఘల్, దివంగత రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు రాజేంద్రప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఆ తర్వాత ‘మాధవి పిక్చర్స్’ సంస్థను స్థాపించి ఎన్నో చిత్రాలను నిర్మించారు. కురుక్షేత్రం, దొరబాబు, ఆటగాడు, సుపుత్రుడు తదితర చిత్రాలు ఆయన నిర్మించినవే. మరోవైపు రాజేంద్రప్రసాద్ మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Tags: Gorantla Rajendra Prasad, Tollywood, Producer Dead

Leave A Reply

Your email address will not be published.