‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు!

రవితేజ కథానాయకుడిగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చాడు. రవితేజ సరసన నాయికలుగా దివ్యాన్ష కౌశిక్ .. రజీషా విజయన్ అలరించనున్నారు. రజీషా విజయన్ ఈ సినిమాతోనే తెలుగు తెరకి పరిచయమవుతోంది.

ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నెల 16వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. 1995లో జరిగిన యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు.

చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాతో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇతర ముఖ్యమైన పాత్రలలో నరేశ్ .. పవిత్ర లోకేశ్ .. తనికెళ్ల భరణి నటించారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.