‘టైగర్ నాగేశ్వరరావు’లో బాలీవుడ్ సీనియర్ స్టార్ !

రవితేజ హీరోగా రీసెంట్ గా వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ థియేటర్స్ లో ఉంది. ఆ తరువాత సినిమాగా ఆయన ‘ధమాకా ‘ చేస్తున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల అలరించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరువుకుంది. ఆ తరువాత ప్రాజెక్టుగా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను చేస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే స్టూవర్టుపురం గజదొంగ జీవితకథ ఇది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం అనుపమ్ ఖేర్ ను తీసుకున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

బాలీవుడ్ సీనియర్ నటిల్లో అనుపమ్ ఖేర్ ఒకరు. బాలీవుడ్ తెరపై నటుడిగా ఆయన తనదైన ప్రత్యేకమైన ముద్రవేశారు. ‘కార్తికేయ 2’ సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేసిన ఆయన, పెద్ద గ్యాప్ లేకుండానే మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave A Reply

Your email address will not be published.