ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేస్తున్న ‘గార్గి’

Sai Pallavi Craze గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. కథల ఎంపిక విషయంలో ఆమె తీసుకునే నిర్ణయం పట్ల అభిమానులకు నమ్మకం ఉంది. అలా ఆమె చేసిన ‘గార్గి’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తమిళ .. కన్నడతో పాటు తెలుగులో ఈ నెల 15వ తేదీన విడుదలైంది. ఈ సినిమాకి సంబంధించి అన్ని భాషలకి చెందిన ఓటీటీ హక్కులను ‘Soni Live’ వారు తీసుకున్నారు. వచ్చేనెల 2వ వారంలో వారు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది.

ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని అంటున్నారు. థియేటర్స్ లో ఈ సినిమాను చూడనివారు ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిని బట్టి చూసుకుంటే, కథనం చాలా నిదానంగా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. యథార్థ సంఘటన ఆధారంగా నిర్మితమైన ఈ సినిమాకి, సాయిపల్లవి నటనే హైలైట్. కథ సహజత్వానికి దగ్గరగా .. ఎమోషన్స్ ను టచ్ చేస్తూ వెళుతుంటుంది. అందువలన ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Sai Pallavi, Kaali Venkat, Gargi Movie in OTT release date

Leave A Reply

Your email address will not be published.