‘పుష్ప 2’లోను సమంత ..

సుకుమార్ తన ఫేవరేట్ హీరోయిన్ సమంత అనే విషయాన్ని చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. ఆమె నటనలో ఒక ప్రత్యేకత కారణంగానే ‘రంగస్థలం’ సినిమాలో ఆమెను ఎంచుకున్నానని అన్నాడు. ఆ తరువాత ఆమె ‘పుష్ప’ ప్రాజెక్టులో జాయిన్ అయింది. అప్పటికే షూటింగు చాలావరకూ పూర్తికావడంతో, ఐటమ్ సాంగ్ కోసం ఆమెను తీసుకున్నాడు. ‘ఉ అంటావా మావా’ అనే పాటలో ఆమె ఇటు యూత్ ను .. అటు మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది. ఆ పాట తరువాత ఆమె ఆ సినిమాలో కనిపించదు. కానీ స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్పకి సాయపడే పాత్రలో ఆమె ‘పుష్ప 2’లో కనిపించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆమె పాత్రను సుకుమార్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టు చెబుతున్నారు.

అతికించినట్టు కాకుండా చాలా సహజంగా ఆమె పాత్రను ప్రవేశపెట్టడం జరుగుతుందని అంటున్నారు. ఇక ‘పుష్ప 2’లో మనోజ్ బాజ్ పాయ్ .. విజయ్ సేతుపతి .. ప్రియమణి పేర్లు కొత్తగా వినిపించాయి. ఇక ఇప్పుడు సమంత పేరు కూడా తెరపైకి వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.