ఒకేసారి రెండు సినిమాలను లైన్లో పెట్టిన శంకర్!

Director Shankar శంకర్ గొప్ప డైరెక్టర్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఇంతవరకూ ఆయన చేస్తూ వచ్చిన సినిమాలు నిదర్శనంగా కనిపిస్తూనే ఉంటాయి. సౌత్ ఇండియా సినిమా పరిధిని పెంచిన దర్శకుడిగా ఆయన కనిపిస్తాడు. మొదటి నుంచి కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమా చేయడమే ఆయనకి అలవాటు.అలాంటి శంకర్ మొదటిసారిగా రెండు సినిమాలను పూర్తిచేసే పనిలో పడటం అంతా ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు.

శంకర్ ‘ఇండియన్ 2’ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకున్నాక చిక్కుల్లో పడింది. ఆ సినిమా షూటింగు ఆగిపోవడంతో Chanran Project R15 ను శంకర్ పట్టాలెక్కించాడు. ఈ సినిమా కూడా కొంతవరకూ చిత్రీకరణ జరువుకుంది.అయితే రీసెంట్ గా ‘Indian2 Project’ కి సంబంధించిన సమస్యలు తొలగిపోయాయి. అందువలన ఆ సినిమా మళ్లీ సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. అప్పటి నుంచి శంకర్ ఈ రెండు సినిమాల షెడ్యూల్స్ మధ్య గ్యాప్ ఇస్తూ రెండు సినిమాలను కూడా పూర్తి చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.