‘సార్’ టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

తమిళంలో ధనుశ్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పుకోవలసిన పనిలేదు. ఈ మధ్య కాలంలో ధనుశ్ ఒక సినిమా ఒప్పుకోవడమే ఆలస్యం, ఆ సినిమా రీమేక్ హక్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో నేరుగా ఒక సినిమా చేయాలని ధనుశ్ భావించాడు. అందుకు సంబంధించిన సన్నాహాలను చకచకా చేసుకున్నాడు.

ముందుగా శేఖర్  కమ్ముల దర్శకత్వంలో చేయాలని ఆయన భావించాడు. అందుకు ఇంకా సమయం ఉండటంతో వెంకీ అట్లూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెలుగులో ‘సార్’ అనే సినిమా రూపొందుతోంది. తమిళంలో ఈ సినిమాకి ‘వాతి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ సినిమా నుంచి ఈ నెల 27వ తేదీన ఫస్టులుక్ ను .. 28వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సాయికుమార్ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

Leave A Reply

Your email address will not be published.