చరణ్ తో తలపడే విలన్ గా ఆయనను ఫైనల్ చేసినట్టే!

చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా చరణ్ కి ఇది 15వ సినిమా అయితే, నిర్మాతగా ఇది దిల్ రాజుకి 50వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా 8 షెడ్యూల్స్ వరకూ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్లో చరణ్ కి సంబంధించిన కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో విలన్ గా ఎస్.జె. సూర్యను అనుకుంటున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా ఆయననే తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సైకో లక్షణాలు ఉన్న విలన్ రోల్స్ ను ఆయన బాగా చేస్తాడు. అందుకు ‘ స్పైడర్’ సినిమానే ఒక ఉదాహరణ. ఇక ‘మానాడు’ సినిమాలోని విలనిజం కూడా ఆయనకి మంచి మార్కులను తెచ్చిపెట్టింది.

ఈ నేపథ్యంలోనే చరణ్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకు ఆయనను శంకర్ ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ముఖ్యమంత్రి తనయుడిగా చరణ్ రోల్ ఉండనుంది. ఆయన లవర్ పాత్రలో కియారా అద్వాని అలరించనుంది. తమన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.