బాలయ్య కోసం బాలీవుడ్ హీరోయిన్..

బాలీవుడ్ లోని భారీ అందాల భామల్లో సోనాక్షి సిన్హా ఒకరు. బలమైన సినిమా నేపథ్యాన్ని కలిగిన కుటుంబం నుంచి వచ్చిన సోనాక్షి, తన టాలెంట్ తోనే నిలబడటానికి ప్రయత్నిస్తూ వచ్చింది. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అప్పుడే పుష్కరకాలమవుతోంది. ఈ పన్నెండు ఏళ్లలో ఆమె హిందీ సినిమాలకి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. తమిళంలో రజనీకాంత్ సరసన నాయికగా సోనాక్షి ‘లింగా’ సినిమా చేసింది. ఆ సినిమాలో గిరిజన యువతిగా ఆమె పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయింది.

ఆ తరువాత ఆమె తెలుగు సినిమాలో కూడా చేస్తుందని అనుకున్నారుగానీ, ఇంతవరకూ చేయలేదు. తాజాగా బాలయ్య సరసన ఆమె చేయనుందనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం బాలయ్య .. గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయనున్నాడు. ఇది తండ్రీకూతుళ్ల ఎమోషన్స్ ప్రధానంగా సాగుతుందని అనిల్ చెప్పాడు. కూతురు పాత్రలో శ్రీలీలను తీసుకోవడం జరిగిపోయిందని అన్నాడు. ఈ సినిమా కోసమే సోనాక్షి ఎంపిక జరిగిందని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.