పారితోషికం రెండింతలు చేసిన కేజీఎఫ్​ హీరోయిన్ శ్రీనిధి

Srinidhi Setty Double Remunaration కేజీఎఫ్1, 2 చిత్రాలు.. భారత సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపాయి. బాహుబలి తర్వాత దక్షిణాది సత్తాను ప్రపంచానికి చాటాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్’ సిరీస్ లోని రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల వసూళ్లు రాబట్టి ఎన్నో రికార్డులు సృష్టించాయి. ఈ సినిమా హీరో యశ్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అతని సరసన నటించిన హీరోయిన్ శ్రీనిధి షెట్టికి కూడా మంచి గుర్తింపు లభించింది. ‘కేజీఎఫ్’ రెండు భాగాల్లోనూ తన అందంతో పాటు అభినయంతోనూ శ్రీనిధి మంచి మార్కులు కొట్టేసింది. దాంతో, దక్షిణాదిలో ఆమెకు డిమాండ్ పెరిగింది.

శ్రీనిధి ఇప్పుడు ‘కోబ్రా’ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగు పెడుతోంది. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ‘కోబ్రా’ కోసం శ్రీనిధి భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘కేజీఎఫ్’తో అందుకున్నదానికంటే ఈ చిత్రంతో రెండింతలు సంపాదించిందట. కన్నడ ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు కేజీఎఫ్ లో రీనా పాత్ర కోసం శ్రీనిధి రూ. మూడు కోట్ల పారితోషికం తీసుకుంది. ఆ

సినిమా భారీ విజయం తర్వాత దేశ వ్యాప్తంగా తనకు దక్కిన గుర్తింపును క్యాష్ చేసుకుంటున్న ఈ హీరోయిన్ ‘కోబ్రా’ చిత్రంలో నటించినందుకు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, రోషన్ మాథ్యూ, మృనాళిని రవి, ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
KGF Kollywood, SRINIDHI SHETTY COBRA MOVIE, Bollywood, remuneration DOUBLE

Leave A Reply

Your email address will not be published.