Thank you movie trailer ‘థ్యాంక్యూ’ ట్రైలర్ రిలీజ్ కి రంగం సిద్ధం!

నాగచైతన్య హీరోగా దర్శకుడు విక్రమ్ కుమార్ ‘థ్యాంక్యూ’ సినిమా చేశారు. విభిన్నమైన కథాకథనాలతో ఈ  సినిమాను రూపొందించినట్టుగా ఆయన చెప్పారు. ఇలాంటి ఒక పాయింట్ ను ఇంతవరకూ ఎవరూ టచ్ చేయలేదంటూ అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి రంగాన్ని సిద్ధం చేశారు.

ఈ రోజున సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ తోనే అంచనాలు పెరిగేలా విక్రమ్ కుమార్ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఇక ఇప్పటి నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకోనున్నాయి. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

‘బంగార్రాజు’ హిట్ తరువాత చైతూ చేసిన సినిమా ఇది. ఇక ‘పక్కా కమర్షియల్’ తరువాత రాశి ఖన్నా చేసిన సినిమా ఇది. ఇతర కథానాయికలుగా మాళవిక నాయర్ .. అవికా కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. చాలా గ్యాప్ తరువాత విక్రమ్ కుమార్ చేసిన ఈ సినిమా, ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

 

Leave A Reply

Your email address will not be published.