Sat. Feb 22nd, 2020

అందాలతో మతి పోగొడుతోన్న హీరోయిన్లు..

Twitter,Samanta,Manchu Lakshmi,Tollywood

  • నామ్ ఫౌండేషన్ సెలబ్రిటీ క్యాలండర్ కోసం ఫొటోలు
  • రవివర్మ చిత్రాల్లా పోజులు
  • వైరల్ అవుతోన్న హీరోయిన్ల ఫొటోలు

హీరోయిన్ సమంతతో పాటు పలువురు హీరోయిన్లు తాజాగా షేర్‌ చేస్తోన్న తమ ఫొటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే రవి వర్మ కుంచే నుండి జాలువారిన అందాల పెయింటిగ్‌ రూపంలో హీరోయిన్లు ఫొటోలు దిగారు.

అమ్మాయిలు అందంగా ఉంటే ‘రవివర్మ గీసిన బొమ్మలా ఉన్నావు’ అంటారు. అచ్చం రవివర్మ గీసిన బొమ్మలకు ప్రతిరూపంలా హీరోయిన్లు ఫొటోలు దిగారు. తమ ఫొటోలను ఇంత అందంగా తీర్చిదిద్దిన ఫొటో గ్రాఫర్లకు హీరోయిన్లు కృతజ్ఞతలు చెబుతున్నారు.

నామ్ ఫౌండేషన్ సెలబ్రిటీ క్యాలండర్ కోసం రవివర్మ చిత్రాల్ని మైమరిపిస్తూ అందాల హీరోయిన్లు సమంత, శ్రుతిహాసన్, ఐశ్వర్య రాజేశ్, రమ్య కృష్ణ, మంచు లక్ష్మి, ఖుష్బూ సుందర్ వంటి కొందరు ఈ ఫొటోల్లో ఇలా కనపడుతున్నారు. ప్రస్తుతం హీరోయిన్ల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.                              
Tags: Twitter,Samanta,Manchu Lakshmi,Tollywood

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *