మతి పోగొడుతున్న లైగర్ పోస్టర్..

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న లైగర్, ప్రొమోషనల్ మెటిరియల్ తో చిత్ర యూనిట్ మరింత భారీ అంచనాలని పెంచుతోంది. విజయ్ దేవరకొండ పాత్రను సూచించే సాలా క్రాస్‌బ్రీడ్ అనే ట్యాగ్‌లైన్ బోల్డ్‌గా, ప్రభావవంతంగా అనిపిస్తుంది.

సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించడానికి చిత్ర యూనిట్ అహర్నిశలు శ్రమించి ఎక్కడా రాజీపడకుండా ఈ ఎపిక్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం పనిచేస్తున్నారు. తాజగా లైగర్ టీం ఒక స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ దాదాపు నగ్నంగా తన దేహాన్ని ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు. ఇలా కనిపించడానికి చాలా ధైర్యం ఉండాలి. విజయ్ దేవరకొండ బ్రేవ్‌హార్ట్ అని మరోసారి రుజువైయింది. తాను పెద్ద స్టార్ అయినప్పటికీ పాత్ర విషయంలోఎలాంటి హద్దులు, సంకోచాలు పెట్టుకోరని ఈ పోస్టర్ తో స్పష్టమైయింది. దమ్మున్న కథనంతో వస్తున్న లైగర్ చిరకాలం గుర్తుండిపోయే చిత్రం కాబోతుంది.

ఎంఎంఎ ఫైటర్‌ గా నటించడానికి విజయ్ దేవరకొండ పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు “ నా సర్వస్వం తీసుకున్న సినిమా ఇది. నటన పరంగా, మానసికంగా, శారీరకంగా నా మోస్ట్ ఛాలెంజింగ్ రోల్. నేనుమీకు అన్నీ ఇస్తాను! త్వరలో. #లైగర్” అని విజయ్ ట్వీట్ చేశారు. లెజెండ్ మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రను పోషించారు. ఇటివలే ఆయన పుట్టినరోజు ప్రత్యేక కాను కగా లైగర్ టీం విడుదల చేసిన వీడియో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. లైగర్ టీమ్ ఇటీవల ముంబై లో లీడ్ పెయిర్‌ పై ఒక పాటను చిత్రీకరించారు. త్వరలోనే ప్రమోషన్‌ లను ప్రారంభించి రెగ్యులర్ అప్‌డేట్స్ తో రాబోతున్నారు. లైగర్ లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.