షారుక్ తో తలపడనున్న విజయ్ సేతుపతి!

ఒక వైపున హీరోగా .. మరో వైపున విలన్ గా తమిళనాట విజయ్ సేతుపతి దూసుకుపోతున్నాడు. ఆ మధ్య ‘ఉప్పెన’లో ఆయన చేసిన పాత్ర .. ఇటీవల ‘విక్రమ్’ సినిమాలో చేసిన పాత్ర ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ లోను నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర కోసం ఆయనను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ సినిమా ‘జవాన్’ నుంచి కూడా ఆయనకి పిలుపు వచ్చినట్టుగా చెబుతున్నారు. హిందీలో షారుక్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ‘జవాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ రోల్ ఉందట.

ఈ పాత్రకి విజయ్ సేతుపతి అయితే బాగుంటాడని షారుక్ ను అట్లీ కుమార్ ఒప్పించినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగులో ఆయన జాయిన్ అవుతాడని అంటున్నారు. ఈ సినిమాతో విజయ్ సేతుపతి రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నయనతార .. సాన్య మల్హోత్రా .. ప్రియమణి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
Tags: Sharukh Khan, Natanatara, Atlee Kumar, Jawan Movie

Leave A Reply

Your email address will not be published.