‘హ్యాపీ బర్త్ డే’తో లావణ్యకు హిట్ పడేనా?

‘అందాల రాక్షసి’ అనే తన తొలి చిత్రంతోనే లావణ్య త్రిపాఠి సక్సెస్ ను అందుకుంది. ఆ తరువాత కూడా ‘భలే భలే మగాడివోయ్’ .. ‘సోగ్గాడే చిన్నినాయనా’ .. ‘అర్జున్ సురవరం’ వంటి భారీ విజయాలు ఆమె ఖాతాలో కనిపిస్తాయి. గ్లామర్ పరంగాగానీ .. నటన పరంగా గాని లావణ్యకి వంకబెట్టవలసిన పనిలేదు.

అయితే కొంతకాలంగా ఆమె వెనుకబడటం కనిపిస్తుంది .. ‘చావుకబురు చల్లగా’ సినిమా ఫలితంతో డీలాపడటం కనిపిస్తుంది. అలాంటి లావణ్య తాజా చిత్రంగా రూపొందిన ‘హ్యాపీ బర్త్ డే’ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రితేశ్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా పలకరించనుంది.

తన కెరియర్ లో ఇంతవరకూ ఇలాంటి ఒక పాత్రను చేయలేదనీ .. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకం ఉందని లావణ్య చెబుతోంది. మరి ఆమె నిరీక్షణ ఈ సినిమాతో ఫలిస్తుందేమో చూడాలి. వెన్నెల కిశోర్ .. నరేశ్ అగస్త్య .. సత్య ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
Tags: lavanya Tripathi,Vennela Kishore, Sathya

Leave A Reply

Your email address will not be published.