తారక్ తో అవకాశం కోసం ఎదురు చూస్తున్నా: జాన్వీ కపూర్

అతిలోక సుందరిగా ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎంతో పాప్యులారిటీని సంపాదించుకుంది. యూత్ లో ఆమెకు ఎంతో క్రేజ్ ఉంది. వరుస సినిమాలతో బాలీవుడ్ లో ఆమె దూసుకుపోతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంలో క్లారిటీ రానప్పటికీ… జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంపై జాన్వీ కపూర్ స్పందిస్తూ… తనకు తెలుగులో లేదా ఏదైనా సౌత్ సినిమాలో చేయాలనే కోరిక ఉందని చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చిందనే రూమర్ నిజమైతే తనంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరని… అయితే దురదృష్టవశాత్తు తనకు అలాంటి ఆఫర్ రాలేదని తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ తో నటించే అవకాశం రావడమంటే మామూలు విషయం కాదని చెప్పింది. తారక్ తో అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపింది. మరోవైపు జాన్వి ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.