‘నథింగ్’ ఫోన్ల కోసం బుక్ చేసుకున్న వారికి క్షమాపణలు చెప్పిన కంపెనీ

‘నథింగ్’ ఫోన్లపై కస్టమర్లలో ఎన్నో అంచనాలున్నాయి. భిన్నమైన డిజైన్, చక్కని ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ ను తమ సొంతం చేసుకోవాలన్న ఆరాటంతో ఎంతో మంది ముందుగానే బుక్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వీరంతా నిరాశ చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ముందుగా బుక్ చేసుకున్న వారికి డెలివరీలో ప్రాధాన్యం ఇస్తామని, వారికి వీలైనంత త్వరగా డెలివరీ చేస్తామని కంపెనీ ప్రకటించింది. అయినప్పటికీ మరికొన్ని రోజుల పాటు వేచి చూడక తప్పేలా లేదు.

‘‘జాప్యం నెలకొన్నందుకు మేము క్షమాపణలు కోరుతున్నాం. ఫోన్ బ్యాక్ ప్యానెల్ వల్ల ఉత్పత్తిలో ఆలస్యం నెలకొనలేదు. ఎన్నో విడిభాగాలతో కూడిన అసెంబ్లింగ్ వల్లే ఆలస్యం అవుతోంది. చాలా ఫోన్లను ఈ వారాంతానికి, లేదంటే ఆగస్ట్ 3 నాటికి డెలివరీ చేస్తాం’’ అని నథింగ్ కంపెనీ ఇండియా హెడ్ మను శర్మ ప్రకటించారు. మరోవైపు 12జీబీ, 256జీబీ మోడల్ ప్రత్యేక విక్రయాలు (ప్రీ ఆర్డర్) ఈ నెల 27న మధ్యాహ్నం ఫ్లిప్ కార్ట్ లో జరుగుతాయని సంస్థ ప్రకటించింది.
Nothing Phone 1, deliveriesdelayed, company apologies

Leave A Reply

Your email address will not be published.