నేటి నుంచే ‘నథింగ్’ ఫోన్ల అమ్మకాలు

ప్రపంచంలో తొలి ట్రాన్స్ పరెంట్ స్మార్ట్ ఫోన్ (పారదర్శకంగా కనిపించేది) అయిన ‘నథింగ్’ ఫోన్ (1) విక్రయాలు ఫ్లిప్ కార్ట్ పై నేటి (21న) సాయంత్రం 7 గంటలకు మొదలు కానున్నాయి. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.31,999. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999. ఇక 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ ధర రూ.37,999. కేవలం తెలుపు, నలుపు రంగుల్లోనే ఇది లభిస్తుంది. రూ.1,000 తగ్గింపును కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది.ne

ఫోన్ వెనుక భాగం పారదర్శకంగా ఉంటుంది. లోపలి భాగం బయటకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే, కాల్స్, నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెనుక లైట్లు వెలుగులూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778 జీప్లస్ ప్రాసెసర్, 6.55 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ ప్లే, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్ లెస్ చార్జింగ్, 50 మెగా పిక్సల్ సోనీ కెమెరా సెన్సార్,120 హెర్జ్ రీఫ్రెష్ రేటు ఈ ఫోన్లోని కొన్ని ప్రత్యేకతలు. ముందుగా ఆర్డర్లు ఇచ్చిన వారికి డెలివరీలో ప్రాధాన్యం ఇస్తామని కంపెనీ ప్రకటించింది.
Nothing Phone, 1 sales, today, starts

Leave A Reply

Your email address will not be published.