‘జిన్నా’గా వస్తున్న మంచు విష్ణు

Ginna First Look Telugu మంచు మోహన్ బాబు నట వారసుడిగా తెలుగు తెరకు పరిచయం అయిన మంచు విష్ణు హిట్లు, ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘జిన్నా’. స‌న్నీ లియోన్‌, పాయల్ రాజ్‌పుత్‌ హీరోయిన్లు. ఇషాన్ సూర్య ఈ చిత్రంతో ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఫ‌స్ట్‌ లుక్‌ మోషన్ పోస్టర్ ను చిత్రం బృందం ఈ రోజు విడుదల చేసింది.

ఈ చిత్రంలో మంచు విష్ణు సరికొత్త పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. ‘జిన్నా’అనే వైవిధ్యమైన పేరు పెట్టడంతో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ గ్లింప్స్ ఆసక్తికరంగా మలచింది చిత్ర బృందం. షూటింగ్ లొకేషన్లోనే భిన్నమైన కాన్సెప్ట్ తో చేసిన గింప్స్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ ఎపిసోడ్ కోసం షాట్ రెడీ అయిందని ఎన్నిసార్లు పిలిచినా పలకని విష్ణు.. ‘జిన్నా షాట్ రెడీ’ అనగానే ఉత్సాహంగా ముందుకొచ్చే వీడియో ఆసక్తికరంగా ఉంది.

ఈ చిత్రంలో విష్ణు.. గాలి నాగేశ్వర్ రావు అనే పాత్రలో న‌టిస్తున్నాడు. ర‌చ‌యిత, నిర్మాత కోన‌ వెంక‌ట్ ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించ‌డంతో పాటు క్రియేటీవ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్యవహ‌రిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా.. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నాడు. దీనికి మోహన్ బాబు నిర్మాత.

Tollywood, Manchu Vishnu, Mohan Babu, payal rajpoot, Sunny Leone, new movie, motion poster

Leave A Reply

Your email address will not be published.