Fri. Feb 21st, 2020

సాయి జన్మస్థలంపై వివాదం… షిరిడీలో బంద్ విరమణ

Shirdi Maharashtra, Saibaba Padhri, Udhav Thackerey

Shirdi Maharashtra, Saibaba Padhri, Udhav Thackerey

మహారాష్ట్రలోని షిరిడీలో సాయిబాబా జన్మభూమి వివాదం నేపథ్యంలో నిర్వహించిన బంద్ ను విరమించారు. పాథ్రీ ప్రాంతాన్ని సాయి జన్మస్థలంగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ షిరిడీ వాసులు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బంద్ ను విరమిస్తున్నట్టు ప్రకటించారు. రేపు సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ఇటీవల పర్బని జిల్లాలోని పాథ్రీలో సాయి జన్మస్థానం వసతుల కల్పనకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించడంతో వివాదం రాజుకుంది. పాథ్రీనే సాయి జన్మస్థలమని చెప్పేందుకు ఆధారాలు లేవని షిరిడీ ప్రజలంటున్నారు. అటు, షిరిడీ వాసుల బంద్ కు ప్రతిగా పాథ్రీలో పాథ్రీ కృతి సమితి బంద్ కు పిలుపునిచ్చింది.
Tags: Shirdi Maharashtra, Saibaba Padhri, Udhav Thackerey

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *