స్వాతంత్యోద్య్రమ స్ఫూర్తిని కొనసాగించాలి !

‘‘‌మోదీ ప్రభుత్వం కూడా గత ఎనిమిదేళ్ళ కాలంలో నయా ఉదారవాద విధానాలను దూకుడుగా అమలు చేసింది. దీనివల్ల పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి. 2011లో కేవలం 55 మందిగా వున్న శత కోటీశ్వరుల సంఖ్య 2021లో 140కి పెరిగింది. వీరి ఆస్తుల మొత్తం విలువ 59,600 కోట్ల డాలర్లకు చేరింది. ఇది జిడిపిలో 19.6 శాతంగా వుంది.  ప్రజారోగ్య వ్యవస్థ, ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో అభివృద్ధి, విస్తరణకు సంబంధించి  వైఫల్యం నెలకొంది. ఇన్నేళ్ల తర్వాత కూడా, ప్రజారోగ్యంపై పెట్టే ఖర్చు జిడిపిలో కేవలం ఒకే ఒక్క శాతంగా వుంది.’’

భారతదేశం స్వాతంత్యోత్స్రవాలను పురస్కరించుకుని 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా దేశ విదేశాల్లోనూ వజ్రోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఊరూవా మువ్వన్నెల జెండా రెపరెప లాడింది. ప్రజలు తమ దేశభక్తిని మనసారా చాటారు. ఈ స్ఫూర్తిని ఇంకా ముందుకు తీసుకుని పోవాలి. పాలకులు ఇక తమ రాజకీయాలను పక్కన పెట్టి దేశం కోసం శ్రమించాల్సిన సమయమిది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక, ఆర్థిక న్యాయానికి విలువనిచ్చే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు  స్వార్థపర రాజకీయశక్తులతో పోరాడేందుకు సమైక్యంగా కృషి చేయాలి. అప్పుడే  పోరాటయోధులు సాధించి పెట్టిన స్వాతంత్య్ర లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఆధునిక కాలంలో ఒక స్వతంత్ర దేశం సాధించిన పురోగతిని అంచనా వేయడానికి ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ కాలం సరిగ్గా సరిపోతుంది. మనం సంబరంగా జరుపుకుంటున్న ఈ వజ్రోత్సవాలను పునఃసక్షించుకుని ముందుకు సాగాల్సి ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలను జరుపు కొంటున్నాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించాం. ఆర్థికంగా కూడా పురోగమించాం. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన దేశ వార్షిక బడ్జెట్‌ 250 ‌కోట్లు దాటలేదు.

ఇందులో దాదాపు 30 కోట్ల ద్రవ్యలోటు ఉంది. ఇప్పుడు దేశ వార్షిక బడ్జెట్‌ ‌దాదాపు 30 లక్షల కోట్ల వరకు ఉంది. వార్షిక ఆదాయం 170 కోట్ల వరకు మాత్రమే ఉన్నప్పటికీ నాటి పాలకులు ప్రభుత్వ రంగ సంస్థలను, సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా వాటిని పూర్తి చేశారు. ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగినప్పటికీ దశాబ్దాల క్రితం ఏర్పాటైన ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకుంటున్నాం.  ఉపాధి ఉద్యోగ రంగాలను దెబ్బతీస్తున్నాం. దేశం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందని చెప్పు కొంటున్న పాలకులే పేదరికం పేరిట ఉచిత పథకాలకు తెర తీస్తున్నారు. మరోవైపు లక్షల కోట్ల కార్పోరేట్‌ ‌రుణాలను మాఫీచేస్తున్నారు. మన నాయకులు కూడా నైతికంగా పతనమవుతూ వచ్చారు. అధికారమే పరమావధిగా రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. అధికారం కోసం సమాజాన్ని కులాలు,

మతాల పేరిట ముక్కలు చెక్కలు చేశారు. తప్పుడు పనులు చేసే వారు కూడా కులాన్ని రక్షణ కవచంగా వాడుకోవడం మొదలెట్టారు.
వజ్రోత్సవాల సందర్భంగా మన పతనాన్ని చూస్తే ఆవేదనే మిగులుతుంది. ఇప్పుడు రాష్టాల్ల్రో గానీ, కేంద్రంలో గానీ అధికారంలో ఉన్నవారెవరూ 1947కి ముందు పుట్టినవాళ్లు కారు. ప్రజా జీవితంలో ఉన్నత ప్రమాణాలు అంటే ఎలా ఉంటాయో చెప్పేవారు కూడా లేరు. ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించినా ఎగతాళికి గురవుతున్నారు.  అత్యంత దుర్భరమైన దారిద్య్ర నెలకొన్న, వ్యాధులతో కునారిల్లుతున్న, నిరక్షరాస్యులైన ప్రజలతో నిండిన ఒక దేశంలో ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మించాలని భారతదేశంలో అధికారంలోకి వచ్చిన కొత్త పాలక వర్గాలు భావించాయి. రెండు శతాబ్దాల పాటు సాగిన వలస పాలనతో దేశం మొత్తంగా కుంగుబాటుకు గురైంది. అభివృద్ధి వెనుకపట్టు పట్టింది. స్వాతంత్యాన్రికి ముందు అర్ధ శతాబ్దంలో వ్యవసాయ జనాభా తలసరి ఆదాయం పూర్తిగా క్షీణించింది. 1950లో రాజ్యాంగాన్ని ఆమోదించడం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం స్వతంత్ర భారతదేశం సాధించిన ముఖ్యమైన విజయం.

నయా ఉదారవాద విధానాలకు మారడంతో, మూడు దశాబ్దాల క్రితం వరుసగా వచ్చిన ప్రభుత్వాలు సంపన్నులను మరింత సంపన్నులుగా తయారు చేసే అభివృద్ధి పంథాను పెంచి పోషిస్తూ వచ్చాయి. బూర్జువా సంస్థలకు, వారితో కుమ్మక్కైన – అంతర్జాతీయ ఆర్థిక పెట్టుబడిదారులకు అనుకూలంగా లొంగి వుండేటువంటి విధానాల రూపకల్పన పెరుగుతూ వచ్చింది.మోదీ• ప్రభుత్వం కూడా గత ఎనిమిదేళ్ళ కాలంలో నయా ఉదారవాద విధానాలను దూకుడుగా అమలు చేసింది. దీనివల్ల పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి. 2011లో కేవలం 55 మందిగా వున్న శత కోటీశ్వరుల సంఖ్య 2021లో 140కి పెరిగింది. వీరి ఆస్తుల మొత్తం విలువ 59,600 కోట్ల డాలర్లకుచేరింది. ఇది జిడిపిలో 19.6 శాతంగా వుంది.  ప్రజారోగ్య వ్యవస్థ, ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో అభివృద్ధి, విస్తరణకు సంబంధించి  వైఫల్యం నెలకొంది. ఇన్నేళ్ల తర్వాత కూడా, ప్రజారోగ్యంపై పెట్టే ఖర్చు జిడిపిలో కేవలం ఒకే ఒక్క శాతంగా వుంది.

ప్రపంచంలోనే చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదేనంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా రూపాయి పతనాన్ని అడ్డుకోలేక పోతున్నాం. ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం సఫలీకృతం కాలేదంటూ రాజ్యాంగం తుది ముసాయి దాను ఆమోదించిన సమయంలోనే 1949లో రాజ్యాంగ నిర్ణాయక అసెంబ్లీలో డాక్టర్‌ అం‌బేద్కర్‌ ‌హెచ్చరించారు. బడా కార్పొరేట్‌ ‌సొమ్ము రాజకీయ వ్యవస్థను కాలుష్యం చేస్తోంది. స్వాతంత్యో ద్యమం ద్వారా ప్రజలు సాధించిందీ, రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలు అన్నీ కూడా తీవ్ర దిగ్బంధాన్ని ఎదుర్కొంటున్నాయి. మరింత మెరుగైన జీవితం కావాలన్న ప్రజల ఆకాంక్షలునెరవేరడం లేదు. బతకడమే భారంగా మారేలా విధానాలు ఉన్నాయి.

మెరుగైన పాలన కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు సమైక్యంగా వుండేందుకు ప్రయత్నాలు చేయాలి. అప్పుడే స్వాతంత్ర ఉద్యమ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. దేశాన్ని వేగంగా ముందుకు తీసుకుని వెళ్లగలం. కార్పోరేట్లకు దోచిపెట్టే దేశ సంపదను అడ్డుకోవాల్సిందే. అప్పుడే ప్రజలకు ఈ దేశ ఆస్తులపై హక్కు లభిస్తుంది. అందరికీ ఆహారం, కూడు, గుడ్డా, నివాసం వంటి లక్ష్యాలను చేరుకోవాలి. ఉద్యోగం లేదా ఉపాధి అన్నది హక్కుగా రావాలి. ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న డబ్బును దుబారా చేయకుండా నిరోధించాలి.  అభివృద్ది పనులకే సొమ్మును వినియోగించాలి. ఈ దిశగా పోరాటం నిరంతరాయంగా సాగాలి. ఇందుకు స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో పనిచేయాలి.

Leave A Reply

Your email address will not be published.