కేసీఆర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భజరంగ్ దళ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో భజరంగ్ దళ్ నేతలు ఫిర్యాదు చేశారు. హిందూ దేవతలకు కించపరుస్తూ కేసీఆర్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా భజరంగ్ దళ్ నేత అభిషేక్ మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీన నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ హిందూ దేవతలను విమర్శించారని చెప్పారు.

ఇటీవల సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ తెలంగాణలో ఉన్న దేవతలను కీర్తించారని తెలిపారు. కేసీఆర్ మాత్రం హిందూ దేవతలను కించపరిచారని చెప్పారు. కేసీఆర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామని తెలిపారు.
KCR, TRS, Bhajarang Dal

Leave A Reply

Your email address will not be published.