Sun. Jul 12th, 2020

తెలంగాణ గవర్నర్ త్వరలో ప్రజాదర్బార్?

Governor, Grievance Cell, Raj bhavan

రాజ్ భవన్లో ప్రజల సమస్య తెలుసుకునే ప్రయత్నం
ముమ్మరంగా జరుగుతున్న ఏర్పాట్లు
ఎప్పటి నుంచి ప్రారంభించేది త్వరలో ప్రకటన
తెలంగాణ ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తమిళి సై ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాజ్ భవన్లోనే ప్రజల్ని నేరుగా కలుసుకోవాలని నిర్ణయించడంతో ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. దీనికి ప్రజాదర్బార్ లేదా ప్రజాభవన్ అని పేరు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి రాజ్ భవన్ అధికారులు గవర్నర్లోను, ఐటీ సెల్ అధికారులతోనూ సమావేశమై కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభించేది ఇంకా తేదీ ఖరారు కాలేదు.
Tags: Governor, Grievance Cell, Raj bhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *