మీ దార్శనికతకు దాసోహం!

మీ దార్శనికతకు దాసోహం అంటూ…మీ అభివృద్ధి దీక్షాదక్షత మీకే సొంతం..పుట్టి పెరిగిన ఊరి మార్పు చూసి ఉప్పొంగి పోయా అంటూ సిద్ధిపేటకు చెందిన గుండా నరేందర్‌ ‌రెడ్డి ఇటీవల నెదర్లాండ్‌ ‌నుండి సిద్దిపేటకు వొచ్చిన సందర్భంగా వజ్రోత్సవాలు పురస్కరించుకుని మంత్రి హరీష్‌రావుకు ఉత్తరం ద్వారా తన మనోగతాన్ని వెల్లడించారు. సిద్ధిపేట పట్టణానికి చెందిన నరేందర్‌ ‌రెడ్డి గత 20ఏళ్ల క్రితం నెదర్లాండ్‌కి వెళ్లి స్థిరపడి ప్రముఖ ఎన్‌ఆర్‌జి గ్రూప్స్ ఆఫ్‌ ‌కంపెనీ సిఈవో స్థాయికి ఎదిగి ఇటీవల సిద్దిపేటకు వొచ్చారు. 20 ఏళ్ల తర్వాత వొచ్చిన నరేందర్‌రెడ్డి సిద్దిపేటను చూసి ఒక్కసారి ఆశ్చర్యం అయ్యారు. నేను సిద్దిపేటలోనే ఉన్నానని ఆలోచనలో పడ్డారు. విన్నాను కానీ చూస్తే అవ్వక్కయ్యాయనీ అని ఆనందంతో ఉప్పొంగారు. తన మిత్రులు పాల సాయిరాం, వరాల సురేష్‌ అదే సమయంలో సిద్దిపేట స్టేడియంలో జరుగుతున్న కేసీఆర్‌ ‌క్రికెట్‌ ‌ట్రోఫిని తిలకించారు. ఆర్గనైజర్స్ ‌మచ్చ వేణుగోపాల్‌ ‌రెడ్డి, మల్లిఖార్జున్‌లతో కలిసి అభివృద్ధి ఆనందాన్ని పంచుకున్నాడు. వారితో కలిసి సిద్ధిపేట అంతా తిరిగారు.

నెదర్లాండుకి వెళ్లినా… ఆయన మనసు మాత్రం సిద్ధిపేటపైనే… భావోద్వేగాలతో మంత్రికి నరేందర్‌రెడ్డి ఉత్తరం
నేను పుట్టిన ఊరికి గొప్ప వ్యక్తిగా ఎదిగిన తర్వాత ఎదో చేయాలని తపన ఉంటుంది.. కానీ, ప్రజలు ఎన్నుకొన్న నాయకునిగా ప్రజల ఆలోచలను నిజం చేసే తపన కొందరికే ఉంటుంది అందుకు నిదర్శనం మంత్రి హరీష్‌రావు. ఎంతో మంది నాయకులను నేను చిన్న తనం నుండి చూస్తున్న. కానీ, ఇలాంటి అభివృద్ధి ఎన్ని తరాలు మారినా చెదరదు అని సిరివెలుగులతో సిద్దిపేట రాత మార్చారు మంత్రి హరీష్‌ ‌రావు అని నరేందర్‌రెడ్డి భావోద్వేగాలతో ఉత్తరం రాశారు. ఇటీవల సిద్ధిపేటకు వొచ్చిన ఆయన మళ్లీ తిరిగి నెదర్లాండ్‌కు వెళ్లారు. కానీ, ఆయన మనసు మాత్రం మంత్రి హరీష్‌రావు చేసిన అభివృద్ధి ఆయన కళ్లలో తిరుగుతుంది. అందుకు సాక్ష్యం ఆయన మంత్రి హరీష్‌రావుకు రాసిన ఉత్తరమే. ప్రపంచస్థాయి సొబగులతో పట్టణ కీర్తి ఇనుమడింపజేశారని..అభివృద్ధిపై అసమాన దీక్షాదక్షత మీకు మాత్రమే సొంతం అని మంత్రి హరీష్‌రావును కొనియాడారు.

పుట్టిపెరిగిన ఊరిని చూసి ఆనందబాష్పాలు ఉప్పొంగాయని కళ్లలో నీళ్లు తీసుకున్నాడు. సిద్ధిపేట ప్రాంత వాసిగా అదృష్టంగా భావిస్తున్నన్నారన్నారు. నాటి కోమటిచెరువు ముళ్ల పొదలతో, రాతి బండలతో ఉండే. నేడు కోమటి చెరువు దేశ, విదేశాలను మరిపిస్తున్నదన్నారు. నాడు కరువుతో అలమటించిన ఈ ప్రాంతం నేడు గోదావరి జలాలతో కళకళలాడుతున్నాయి అంటే ఆశ్ఛర్యం వేసింది. అంతర్జాతీయ స్థాయిలో స్టేడియం..స్విమ్మింగ్‌ ‌పూల్‌ ‌చూసి కళ్లు చెదిరాయని చెప్పారు. సిద్ధిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రూపు రేఖలు మార్చిన, ప్రజల ఆలోచన నిజం చేసిన మంత్రి హరీష్‌రావు ఈ ప్రాంత ప్రజలు గర్వ పడే హీరో అని అభివర్ణించారు. ఈ ప్రాంత ప్రజలు అదృష్టవంతులనీ, ఇంకో 10తరాల అభివృద్ధి భవిష్యత్‌ ‌భావి తరాల అభివృద్ధి ఇప్పుడే జరిగిందని ఆ ఉత్తరంలో ఆయన రాసుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.