ప్రతిపక్షాల లక్ష్యంగా ఐటీ దాడులు

హైదరాబాద్, (ఎఫ్ బి తెలుగు): టీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతున్నారు. ఇటీవల 10 లక్షల ఉద్యోగాలపై టీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. ఇది ఎన్నికల స్టంట్ గా అభివర్ణించింది. దీనిపై ప్రధాని మోదీని విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే 10 లక్షల ఉద్యోగాలను స్వాగతిస్తున్నాం అంటూనే గతంలో బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించిందని.. ప్రస్తుతం ఉద్యోగాల భర్తీని నమ్మలేమని వ్యాఖ్యానించారు.

దీంతో పాటు దేశంలో ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్భనం, జీడీపీపై కూడా టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా శ్రీలంక వ్యవహారంలో మోదీ-అదానీలపై విమర్శలు గుప్పిస్తోంది. శ్రీలంక సిలోన్ పవర్ కార్పోరేషన్ చైర్మన్ ఫెర్నినాండో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకలో పవర్ ప్రాజెక్ట్ అదానీకి ఇవ్వాలని మోదీ, అధ్యక్షుడు గోటబయ రాజపక్సపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆరోపించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండియాలో రాజకీయ వేడిని రగిల్చాయి.

బుధవారం ఈ అంశంపై ‘ మోడీ మస్ట్ రిజైన్’ అనే హాష్ ట్యాగ్ తో టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు.తాజాగా మంత్రి కేటీఆర్ ఈడీ, సీబీఐ, ఐటీ రైడ్స్ పై స్పందించారు. తాజాగా ఈ అంశంపై ట్వీట్ చేశారు. దేశంలో ప్రతిపక్షాలే టార్గెట్ గా దాడులు చేస్తున్నాయని.. కానీ శ్రీలంక ప్రభత్వ సీనియర్ అధికారులు పవన విద్యుత్ ఒప్పందంలో ప్రధాన మంత్రిపై ఆరోపణలు చేసినప్పుడు ప్రధాని కానీ, అదానీ కానీ స్పందించరని.. మీడియా కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని.. చెవిటి నిశ్శబ్దం అంటూ ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.