వాజ్‌పేయ్‌కు నేతల ఘన నివాళి

  • వర్ధంతి సందర్భంగా సదైవ అటల్‌ ‌వద్ద ప్రముఖుల శ్రద్దాంజలి
  • రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ సహా పలువురి నివాళి

న్యూ దిల్లీ, ఆగస్ట్ 16 : ‌దివంగత ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌, ‌ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌, ‌కేంద్రమంత్రులు అమిత్‌ ‌షా, రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌పలువురు ప్రముఖులు మాజీ ప్రధానికి పుష్పాంజలి ఘటించి స్మరించుకున్నారు.భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు నివాళులు అర్పించారు. దిల్లీలోని వాజ్‌పేయీ స్మారకం ’సదైవ్‌ అటల్‌’‌కు తరలివెళ్లి.. ఆ మహానేత సేవలను స్మరించుకున్నారు. వీరితో పాటు వాజ్‌పేయి దత్త కూతురు నమితా కౌల్‌ ‌భట్టాచార్య సైతం ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని వాజ్‌ ‌పేయి స్మారకం సదైవ్‌ అటల్‌ ‌దగ్గరకు చేరుకున్న నేతలు అటల్‌ ‌బిహారీ వాజ్‌ ‌పేయికి శ్రద్దాంజలి ఘటించారు. అంతకుముందు వాజ్‌పేయీ స్మారకార్థం ఏర్పాటు చేసిన ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు. భాజపా అధికారంలోకి రావడంలో వాజ్‌పేయీ కీలక పాత్ర పోషించారు. వాజ్‌పేయీ నేతృత్వంలోని నేషనల్‌ ‌డెమోక్రాటిక్‌ అలియన్స్(ఎన్‌డీఏ) ప్రభుత్వం 1998-2004 వరకు అధికారంలో ఉంది. భాజపా నుంచి ప్రధాని అయిన తొలి నేతగా గుర్తింపు పొందారు.

ఆయన మూడు సార్లు ప్రధానిగా సేవలను అందించారు. 1996లో ప్రధాని అయినప్పటికీ ఆయన ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేదు. మళ్లీ 1998, 1999లో ప్రధానిగా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ 2018, ఆగస్టు 16న 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయనకు 2015లో ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వాజ్‌పేయి 1924 డిసెంబరు 25న మధ్యప్రదేశ్‌ ‌లోని గ్వాలియర్‌లో జన్మించారు. వాజ్‌ ‌పేయి దేశానికి మూడుసార్లు ప్రధానమంత్రిగా సేవలందించి.. నిస్వార్ధ రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు అందుకున్నారు. 1996లో 13 రోజులు, 1998,99 కాలంలో 13 నెలలు, 1999 నుంచి 2004 వరకు ఐదేళ్ల పాటు పూర్తికాలం ప్రధానిగా సేవలందించారు. అంతకుముందు మొరార్జీ దేశాయ్‌ ‌నేతృత్వంలోని జనతా ప్రభుత్వంలో భారత విదేశాంగ శాఖ మంత్రిగా అటల్‌ ‌పనిచేశారు. జనతా ప్రభుత్వం కూలిపోయినప్పుడు .. భారతీయ జనసంఘ్‌ ‌లోని ఇతర సభ్యులతో కలిసి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 15 ఏళ్లపాటు దేశమంతా పర్యటించి పార్టీ విస్తరణలో వాజ్‌ ‌పేయి కీలక భూమిక పోషించారు. తన రాజకీయ జీవితంలో ఆయన 10 సార్లు లోక్‌ ‌సభ, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1957లో బలరాంపూర్‌ ‌నియోజకవర్గం నుంచి తొలిసారిగా వాజ్‌ ‌పేయి లోక్‌ ‌సభకు ఎన్నికయ్యారు.

Leave A Reply

Your email address will not be published.