టీఆర్ఎస్‌కు రాజీనామా చేయ‌నున్న మంత్రి ఎర్ర‌బెల్లి సోద‌రుడు ప్ర‌దీప్ రావు

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు రాజీనామాల ప‌ర్వం కొన‌సాగుతోంది. పార్టీ కీల‌క నేత‌, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సోద‌రుడు ప్ర‌దీప్ రావు తాజాగా టీఆర్ఎస్‌కు రాజీనామా చేసేందుకు నిర్ణ‌యించుకున్నారు. ఈ నెల 7న ఆయ‌న టీఆర్ఎస్‌కు రాజీనామా చేసేందుకు సిద్ధప‌డ్డారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం వ‌రంగ‌ల్‌లో ఆయ‌న త‌న అనుచరుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ కానున్నారు.

ఈ భేటీలో తాను టీఆర్ఎస్‌కు ఎందుకు రాజీనామా చేయ‌నున్నాన‌న్న విష‌యాన్ని ఆయ‌న త‌న అనుచ‌రుల‌కు చెప్ప‌నున్న‌ట్లుగా స‌మాచారం. అంతేకాకుండా టీఆర్ఎస్‌కు రాజీనామా త‌ర్వాత త‌న భవిష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ఖ‌రారుపైనా ఆయ‌న త‌న అనుచ‌ర వ‌ర్గానికి స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.