మంథని డివిజన్ లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకుల అరెస్టులు

మంథని: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శనివారం తలపెట్టిన సడక్ బంద్ సందర్భంగా మంథని నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ల కు తరలించారు. మంథనిలో ఎంఎస్పి నాయకులు మంథని సామ్యెల్ మాదిగ, మంథని చందు మాదిగ ను, రామగిరి మండలంలో కండె గట్టయ్య,కల్వల కుమార్, భద్రయ్య లను, పెద్దపల్లి,8వ కాలనీ,మహదేవ్ పూర్ లలో కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

అరెస్టు తర్వాత ఎమ్మెస్పీ జిల్లా కన్వీనర్ మంథని సామ్యెల్ మాదిగ మాట్లాడుతూ ఇచ్చినమాట నిలబెట్టుకోవడం కాకుండా ఉద్యమ కారులను అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నమని అన్నారు. నిజాయితీ, చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలే ఇలాంటి విధానాన్ని అవలంభిస్తాయని, తక్షణమే వర్గీకరణ పై బీజేపీ వైఖరి స్పష్టం చేయాలని, లేకుంటే భవిష్యత్తు ఏందో తేల్చుతామని గుర్తు చేస్తున్నామన్నారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్ నాయకులు మంథని పాత పెట్రోల్ బంకు వద్ద శనివారం ఉదయం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. వీరిని కూడా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Leave A Reply

Your email address will not be published.