రక్షాబంధన్‌ ‌శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

న్యూ దిల్లీ,ఆగస్ట్11: ‌దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌది ముర్ము,ప్రధాని నరేంద్ర మోడీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు గురువారం రక్షా బంధన్‌ ‌పండుగను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మోడీ ట్విట్టర్‌ ‌ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆప్యాయత, నమ్మకానికి, అన్నాచెల్లెల్లు,అక్కాతమ్ముడు మధ్య విడదీయరాని బంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్‌ ‌సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్‌ ‌చేశారు. ఈ పండుగ మన సమాజంలో సామరస్యాన్ని పెంపొందించాలని, మహిళల పట్ల గౌరవాన్ని పెంచాలని కోరుకుంటున్నట్టు ముర్ము ఈ సందర్భంగా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.