చెప్పులు మోసే గుజరాతీ గులాములను తెలంగాణ గమనిస్తోంది: కేటీఆర్

మునుగోడులో నిర్వహించిన ‘భాజపా సమరభేరి’ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం పాల్గొన్న విషయం తెలిసిందే. మునుగోడు పర్యటనలో భాగంగా తొలుత హైదరాబాద్ చేరుకున్న అమితా షా.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గుడి బయట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమిత్ షాకు చెప్పులు అందిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆ వీడియోను మంత్రి కేటీఆర్ ట్విటర్ లో షేర్ చేస్తూ స్పందించారు.

“దిల్లీ ‘చెప్పులు’ మోసే గుజరాతీ గులాములను.. దిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుణ్ణి తెలంగాణ గమనిస్తోంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పిగొట్టి ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్గం సిద్ధంగా ఉంది” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు..

Leave A Reply

Your email address will not be published.