జైళ్ల శాఖలో తెలంగాణ, ఆంధ్రా ఆధిపత్య పోరాటం…

తెలంగాణా జైళ్ల శాఖలో గత సంవత్సర కాలంగా ఆధిపత్య పోరు తీవ్రంగా కొనసాగుతుంది. కీలకంగా ఉన్న ఏడుగురు అధికారుల మధ్య తీవ్ర సంఘర్షణ నడుస్తున్నట్లు తెలుస్తోంది.

  • ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన అధికారులు… ఐజీ రాజేష్ (చిత్తూరు), డీఐజీ మురళీ బాబు(చిత్తూరు), ఎస్పీ కళాసాగర్ (అనంతపూర్)
  • తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారులు… డీఐజీ శ్రీనివాస్ (కామారెడ్డి), ఎస్పీ సంపత్ (ఖమ్మం), ఎస్పీ శివకుమార్ గౌడ్ ( కామారెడ్డి)
  • ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతానికి చెందిన అధికారి… ఎస్పీ, సంతోష్ రాయ్

ఏడు మంది అధికారులలో మళ్ళీ ప్రాంతం వారీగా ఆధిపత్యం కోసం అంతర్గతంగా పోరు జరుగుతున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. ఐజీ రాజేష్, డీఐజీ మురళిబాబులు ఆంధ్ర అధికారుల సహకారంతో డిపార్ట్ మెంట్ లో పట్టుకోసం ప్రయత్నాలు జరుపతున్నట్లు వినికిడి. తెలంగాణకు చెందిన డీఐజీ శ్రీనివాస్,ఎస్పీ శివకుమార్ గౌడ్ లు ప్రభుత్వ సహాకారంతో పట్టుకు యత్నిస్తున్న నేపథ్యంలో జైళ్ల శాఖలో ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు తెలంగాణ అధికారులు, ఇద్దరు ఆంధ్ర అధికారుల మధ్య తీవ్ర విభేదాలు వున్నట్టు డిపార్ట్మెంట్ లో చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ అధికారైన డీఐజీ శ్రీనివాస్ కు ప్రాముఖ్యం లేని వరంగల్ రేంజ్ అధికారిగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో ప్రధాన జైలైన చంచల్ గూడ సెంట్రల్ జైలులో ఎస్పీగా శివకుమార్ గౌడ్ వున్నారు. ఎస్పీ శివకుమార్ గౌడ్ కు చంచల్ గూడ జైల్ పోస్టింగ్ రాకుండా ఆంధ్ర అధికారులు గట్టి ప్రయత్నాలు జరిపినా…తెలంగాణా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది నచ్చని ఆంధ్ర ఉన్నతాధికారులు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం.

జైళ్ల శాఖ సిబ్బందిలో కూడా ఆంధ్ర అధికారుల పెత్తనం ఎక్కువైందని అలాగే ఇద్దరు ప్రధాన అధికారులలో ఒకరికి ప్రాముఖ్యం లేని పోస్టింగ్ లో వుంచి మరొకరిని మంచి పోస్టులో ఉన్నాకూడా ప్రాధాన్యత ఇయ్యకుండ అవమాన పరుస్తున్నారని అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. గత సంవత్సర కాలంగా రెగ్యులర్ డీజీ లేకపోవటం వల్ల డీజీ తరువాత ముఖ్య పోస్టులలో వున్న ఇద్దరు ఆంధ్ర అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ అధికారులను నిర్లక్ష్యము చేస్తున్నారని కింది స్థాయి సిబ్బందిలో తీవ్ర చర్చ జరుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.