గుడ్ న్యూస్.. ఫేస్ బుక్ లో ఒకరి పేరిట మరిన్ని ప్రొఫైల్స్

ఫేస్ బుక్ తన యూజర్ల కోసం సరికొత్త సదుపాయం తీసుకురాబోతోంది. ఒక వ్యక్తి ఒకటికి మించిన ప్రొఫైల్స్ ను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను ఫేస్ బుక్ అభివృద్ధి చేయగా, ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. సాధారణంగా ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ కోసం ఫేస్ బుక్ ఖాతా తెరిచాడనుకోండి. దానిని తన ఉద్యోగ, వ్యాపార వర్గాలతో షేర్ చేసుకోవడం ఇష్టముండదు. ఫేస్ బుక్ కొత్త ఫీచర్ తో ఈ తరహా కష్టాలకు చెక్ పడనుంది.

అప్పుడు ఒక యూజర్ వేర్వేరు అవసరాలకు వేర్వేరు ప్రొఫైల్ ను రూపొందించుకుని, కొనసాగించుకునే అవకాశం లభిస్తుంది. ఒక్కో ప్రొఫైల్ ను ఒక్కో గ్రూపు కోసం కేటాయించుకోవచ్చని ఫేస్ బుక్ సూచించింది. కాకపోతే ఒక్కో ఖాతాకు ఒక్కో ఐడీని ఇవ్వాల్సి వస్తుంది. ‘‘ప్రజలు తమ ఆసక్తులు, సంబంధాలకు అనుగుణంగా.. ఒకే ఫేస్ బుక్ ఖాతాకు ఒకటికి మించిన ప్రొఫైల్ కలిగి ఉండే ఫీచర్ పై పనిచేన్తున్నాం’’ అని ఫేస్ బుక్ అధికార ప్రతినిధి లియోనార్డ్ లామ్ వెల్లడించారు. ఒక యూజర్ ఇలా గరిష్ఠంగా ఐదు ప్రొఫైల్స్ ను కలిగి ఉండొచ్చట.
Facebook, multiple profiles, new feature, testing

Leave A Reply

Your email address will not be published.