మనీష్‌ ‌సిసోడియా ఇంట్లో సిబిఐ దాడులు

దిల్లీ డిప్యూటీ సిఎం మనీష్‌ ‌సిసోడియా ఇంట్లో సిబిఐ దాడులు కొనసాగు తున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్‌ ‌పాలసీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలో సిబిఐ సోదాలు చేస్తోంది. సిసోడియా ఇంటితో పాటు దిల్లీ పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. సిసోడియా ఇంటిపై సిబిఐ దాడులను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌ఖండించారు. ఈ దాడులను రాజకీయ కుట్రగా అభివర్ణించారు. సిసోడియాకు పూర్తి మద్దతు తెలిపిన కేజీవ్రాల్‌ ‌సిబిఐ అధికారులు సహకరిస్తామని పేర్కొన్నారు.

దిల్లీ ఎక్సైజ్‌ ‌పాలసీ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసిన తర్వాత శుక్రవారం దిల్లీ-ఎన్‌సీఆర్‌లోని 21 చోట్ల, ఉప ముఖ్యమంత్రి మనీష్‌ ‌సిసోడియా, ఐఏఎస్‌ అధికారి అరవ గోపీ కృష్ణ ప్రాంగణాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. గతేడాది నవంబర్‌లో తీసుకొచ్చిన ఢిల్లీ ఎక్సైజ్‌ ‌పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలకు సంబంధించి సెంట్రల్‌ ‌బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసిందని వారు తెలిపారు. ఢిల్లీ ఎల్‌-‌జి వికె సక్సేనా, కేజీవ్రాల్‌ ‌ప్రభుత్వ ఎక్సైజ్‌ ‌పాలసీ, 2021-22పై నిబంధనల ఉల్లంఘనలు, విధానపరమైన లోపాలపై సిబిఐ విచారణకు సిఫారసు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌ట్వీట్‌ ‌చేస్తూ.. సిబిఐకి స్వాగతం.. పూర్తి సహకారం అందిస్తాం. ఇంతకుముందు కూడా సోదాలు,దాడులు జరిగాయి, కానీ ఏ దొరకలేదు. ఇప్పుడు కూడా ఏ దొరకదని పేర్కొన్నారు. దిల్లీ ఎక్సైజ్‌ ‌చట్టం ప్రాథమిక ఉల్లంఘనలను చూపుతూ జూలైలో దాఖలు చేసిన ఢిల్లీ చీఫ్‌ ‌సెక్రటరీ నివేదికపై సిబిఐ విచారణకు సిఫార్సు చేసినట్లు వారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.