జనసేన గూటికి కమెడియన్ పృథ్వి రాజ్

టాలీవుడ్ కమెడియన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఈరోజు జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబును ఆయన కలిశారు. జనసేనలో చేరబోతున్నట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్షలో ఉన్నారు. ఆయన దీక్ష ముగియగానే ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో పృథ్వి జనసేన కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన తరపున బరిలోకి దిగాలనుకుంటున్నారు. తన స్వస్థలం తాడేపల్లిగూడెం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.

Comedian Prithvi RajJanasena party
Comments (0)
Add Comment